అంగారకుడిపైకి వెళ్లడం ఇప్పుడిక మరింత సులువు..

  • IndiaGlitz, [Friday,February 05 2021]

అంగారకుడిపైకి వెళ్లడం ఇక మీదట మరింత సులువుతో పాటు మరొక విశేషం కూడా ఉంది. ఇప్పటి వరకూ కేవలం మానవ రహిత ఉపగ్రహాలను మాత్రమే అంగారకుడి పైకి పంపించగలిగారు. కానీ ఇక మీదట మానవ సహిత ఉపగ్రహాలను సైతం పంపించేందుకు మార్గం సుగుమమైంది. ఈ పోటీ ప్రపంచంలో అంగరకుడిపై ఉపగ్రహాలను పంపించడానికి ప్రపంచ దేశాలన్నీ ఒకదానికి మించి మరొకటి పోటీ పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే నాసా, యూరో స్పేస్ ఏజెన్సీ, చైనీస్ స్పేస్ ఏజెన్సీలతో పాటు ఇస్రో కూడా అంగారకుడిపైకి ఉపగ్రహాలను పంపించింది.

అయితే ఇప్పటివరకూ పంపిన ఉపగ్రహాలను బట్టి చూస్తే అంగారకుడిపైకి చేరుకునేందుకు 7 నెలలకు పైగా సమయం పట్టింది. మానవ రహిత ఉపగ్రహాలను పంపిస్తేనే ఇంత సమయం పట్టింది. ఇక మానవ సహిత ఉపగ్రహాలను పంపించాలంటే ఎంత సమయం పడుతుంది? అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికేసింది. అమెరికాకు చెందిన యూఎస్ఎన్‌సీ-టెక్ అనే సంస్థ పరిష్కారాన్ని కనిపెట్టింది. దీనికోసం యూఎస్ఎన్‌సీ-టెక్ ఓ సరికొత్త స్పేస్‌క్రాఫ్ట్ డిజైన్‌‌ను ప్రతిపాదించింది. ఈ డిజైన్‌లో ఇప్పటి వరకూ వాడిన కెమికల్ ఇంజన్ల బదులు అణు ఇంజన్లను వినియోగించనున్నట్లు సంస్థ పేర్కొంది. దీని ద్వారా గతంలో రోదసీలోకి వెళ్లిన ఉపగ్రహాల కంటే తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

అంటే మానవ సహిత ఉపగ్రహం రోదసీలోకి వెళ్లేందుకు గతంలో 7 నెలలకు పైగా సమయం పట్టింది. కానీ సరికొత్త డిజైన్‌ ద్వారా కేవలం 5 నుంచి 9 నెలల్లోనే ఆస్ట్రోనాట్స్‌తో కూడిన స్పేస్‌క్రాఫ్ట్స్‌ను పంపించవచ్చు. ఈ డిజైన్‌ను యూఎస్ఎన్‌సీ-టెక్ కంపెనీ.. నాసాకు కూడా ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న టెక్నాలజీతో కెమికల్ ఇంజన్ల ద్వారా మానవసహిత ఉపగ్రహాలను పంపించాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని, కానీ ఈ అణు ఇంజన్ల వల్ల కేవలం 5 నెలల్లోనే అంగారకుడిపైకి చేరుకోవచ్చని యూఎస్ఎన్‌సీ తెలిపింది. అయితే ఇది సింగల్ ట్రిప్‌కు మాత్రమే ఉపయోగడనుంది.

More News

ఆదిలాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎం మిషన్‌నే లేపేశారు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కలెక్టర్‌ చౌక్‌లో చోటుచేసుకుంది.

‘లూసిఫర్’ రీమేక్‌లో మార్పులు ఇవేనట..

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి  నటించనున్న విషయం తెలిసిందే.

ఏపీని కుదిపేస్తున్న.. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త

విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానుందనే వార్త ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది.

ఫిబ్రవరి 26న 'చెక్' విడుదల

'రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి?'* - హీరో ముందున్న ప్రశ్న.  'యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి'* - దానికి నితిన్ ఇచ్చిన బదులు.

హిట్ సీక్వెల్‌కు బై చెప్పేసిన‌ చైతు...!

అక్కినేని నాగార్జున కెరీర్ బెస్ట్ హిట్ మూవీగా నిలిచిన చిత్రాల్లో ‘సొగ్గాడే చిన్ని నాయ‌నా’ ఒక‌టి.