నాన్న కోరిక మేరకే ‘హీరో’ అయ్యా.. ఆ హీరోలిద్దరూ మెచ్చుకున్నారు!
- IndiaGlitz, [Tuesday,July 09 2019]
దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకుల సంయుక్త దర్శకత్వంలో వస్తోంది. ఈ చిత్రం ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మేఘాంశ్ మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలతో పాటు.. తన రియల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.
సినిమాల్లోకి ఎంట్రీ ఇలా..!
హీరోగా ఇది నా మొదటి సినిమా. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మండుటెండల్లో చిత్రీకరణ చేశాము. చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టి పెరిగినవాడిగా.. సినిమాపై ఫ్యాషన్ ఉంది. అలాగే నాన్న కూడా ఓ సందర్భంలో చిన్నవాడిని యాక్టర్‌ని, పెద్దవాడిని డైరెక్టర్‌ని చేస్తాను అప్పట్లో మాకు చెప్పారు. సినిమాకి ముందు కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. అలాగే స్కూల్ డేస్ నుంచి థియేటర్ డ్రామాలలో నటించిన అనుభవం కూడా నాకు ఉంది. నాన్న కోరిక మేరకు హీరో అయ్యాను. నేను హీరో అవుతున్నానని అమ్మ చాలా సంతోషించారు. అలాగే సినిమా ఎలా వస్తుందో.? అని కొంచెం కంగారు కూడా పడ్డారు. అయితే నేను సినిమాను అమ్మకు చూపించాక చాలా బాగుందని చెప్పారు. అప్పుడు చాలా నేను సంతోషించాను అని మేఘాంశ్ చెప్పుకొచ్చాడు.
సినిమా గురించి..!
ఈ మూవీ చాలా బాగా వచ్చింది. హీరోగా నాకు ఇష్టమైన రాజ్ దూత్ బైక్ కోసం, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై అన్వేషిస్తూ ఉంటాడు.
అయితే ఈ చిత్రాన్ని కేవలం ఒత్తిడి తగ్గించడానికే సినిమా షూటింగ్ ఎటువంటి ప్రచారం లేకుండా రహస్యంగా చిత్రీకరించడం జరిగింది. అంతకు మించి ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు. సినిమాలో కొంత భాగం రోడ్ జర్నీలో సాగుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ మూవీ కాదు. రెండు మూడు, విభిన్న జోనర్స్‌లో సాగే ఓ వైవిధ్యమైన కమర్షియల్ చిత్రం అంతే. ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ లవ్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని సినిమా గురించి కాస్త క్లూ ఇచ్చాడు.
నాన్న, ఇండస్ట్రీ గురించి..!
మా నాన్న నటనలో ప్రతి కోణం నాకు నచ్చుతుంది. ఎమోషనల్ అయినా.. యాంగ్రీ సన్నివేశాలలోనైనా ఆయన నటన చాలా బాగుంటుంది. నాన్న చిత్రాల్లో ‘భద్రాచలం’, ‘ఢీ’, ‘నువ్వులేక నేను లేను’ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నేను కెమెరా ముందు నటించేటప్పుడు మొదట్లో కొంత కంగారుపడ్డాను.. తరువాత మెల్లగా అలవాటు పడ్డాను. ఇండస్ట్రీ మాపై చాలా అభిమానం, ప్రేమ చూపించింది. సాయి ధరమ్ తేజ్ అన్న, అలాగే మంచు మనోజ్ అన్న కాల్ చేసి మరి అభినందించారు నాకు చాలా సంతోషంగా ఉంది.
సినిమా ఆగుతుందేమోనని భయపడ్డా!
అర్జున్, కార్తీక్ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర పనిచేశాను. వీళ్లద్దరి మధ్య వర్క్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి సినిమా ఎక్కడ ఆగిపోతుందో ఒకానొక టైమ్‌లో బాగా భయమేసింది. అలా ఏం కాకుండా ఇద్దరు చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చాలా సంతోషంగా ఉంది అని మేఘాంశ్ తెలిపాడు.