దిల్ రాజు సినిమాల్లో ఈ సారి మిస్సింగ్ అదే
Send us your feedback to audioarticles@vaarta.com
దిల్ రాజు సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. ఆ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కంటెంట్ బేస్‌డ్ మూవీస్ నిర్మించే నిర్మాతగా ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాకుండా.. ఆయన సంస్థ ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేసిన వైనం ఉంది. అలాంటిది ఈ సంవత్సరం దిల్ రాజు నుంచి ఆరు చిత్రాలు వచ్చినా.. వాటిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కొత్త దర్శకుడుతో తెరకెక్కించిన సినిమా లేకపోవడం ఆశ్చర్యకరమే.
శతమానం భవతిని రెండు సినిమాల అనుభవం ఉన్న సతీష్ వేగెశ్న రూపొందిస్తే.. నేను లోకల్ ని నాలుగు చిత్రాల అనుభవం ఉన్న త్రినాథ రావు నక్కిన రూపొందించాడు. దువ్వాడ జగన్నాథమ్‌ని హరీష్ శంకర్.. ఫిదాని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ఇక రాజా ది గ్రేట్ ని రెండు వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి రూపొందించాడు. ఇక ఈ నెలలోనే విడుదలకు సిద్ధమైన ఎం.సి.ఎని ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ రూపొందించాడు. అయితే వచ్చే సంవత్సరం మాత్రం.. తన శైలిలోనే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకున్నారు దిల్ రాజు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout