దిల్ రాజు సినిమాల్లో ఈ సారి మిస్సింగ్ అదే

  • IndiaGlitz, [Tuesday,December 19 2017]

దిల్ రాజు సంస్థ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే.. ఆ సినిమా కోసం తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. కంటెంట్ బేస్‌డ్ మూవీస్ నిర్మించే నిర్మాత‌గా ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అంతేకాకుండా.. ఆయ‌న సంస్థ ఎక్కువ‌గా కొత్త ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేసిన వైనం ఉంది. అలాంటిది ఈ సంవ‌త్స‌రం దిల్ రాజు నుంచి ఆరు చిత్రాలు వ‌చ్చినా.. వాటిలో ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా కొత్త ద‌ర్శ‌కుడుతో తెర‌కెక్కించిన సినిమా లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.

శ‌త‌మానం భ‌వ‌తిని రెండు సినిమాల అనుభ‌వం ఉన్న స‌తీష్ వేగెశ్న రూపొందిస్తే.. నేను లోక‌ల్ ని నాలుగు చిత్రాల అనుభ‌వం ఉన్న త్రినాథ రావు న‌క్కిన రూపొందించాడు. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ని హ‌రీష్ శంక‌ర్‌.. ఫిదాని శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించారు. ఇక రాజా ది గ్రేట్ ని రెండు వ‌రుస విజ‌యాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి రూపొందించాడు. ఇక ఈ నెల‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఎం.సి.ఎని ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ రూపొందించాడు. అయితే వ‌చ్చే సంవ‌త్స‌రం మాత్రం.. త‌న శైలిలోనే ఇద్ద‌రు కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకున్నారు దిల్ రాజు.

More News

గ‌జ‌దొంగ బ‌యోపిక్‌ పై...

ఇప్పుడు ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్‌ల హ‌వా పెరుగుతుంది. తెలుగులో అబ్దుల్ క‌లామ్‌, ఎన్టీఆర్‌, కె.సి.ఆర్‌, చిరంజీవి ....జీవిత చరిత్ర‌లు సినిమాల రూపంలో రానున్నాయి.

బాలీవుడ్ నిర్మాణ సంస్థకి నో చెప్పిన విజయ్

పెళ్ళి చూపులుతో కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ.

శ్రియ.. డబుల్ ధమాకా

పదహారేళ్లుగా కథానాయికగా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శరన్.

ఆ సినిమా కోసం సన్నీకి భారీ రేటు...

బాలీవుడ్ తార సన్నీలియోన్ ఇప్పటి వరకు దక్షిణాది సినిమాల్లో నటించింది.

మెగా హీరో హ్యాట్రిక్ కొడతాడా?

అల్లు అరవింద్ తనయుడు,అల్లు అర్జున్ తమ్ముడు అనే ట్యాగ్ లైన్స్ తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు యంగ్ హీరో అల్లు శిరీష్.