ఇక మహేష్, సుమంత్, గోపీచంద్ వంతు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కాలంలో యువ కథానాయకుల మైల్ స్టోన్ మూవీస్ బాగానే సందడి చేస్తున్నాయి. రెండేళ్ళ క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ వరుసలోనే.. గత ఏడాది శర్వానంద్ 25వ చిత్రం రాధ.. ఈ ఏడాది సంక్రాంతికి పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి.. ఈ ఏడాది వేసవికి నితిన్ 25వ చిత్రం ఛల్ మోహన్ రంగ విడుదలయ్యాయి.
అయితే.. ఈ చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో రానున్న మైల్ స్టోన్ మూవీస్‌పై అందరి దృష్టి పడింది. ఈ లిస్ట్‌లో మహేష్ 25వ చిత్రం (వంశీ పైడిపల్లి దర్శకుడు), సుమంత్ 25వ చిత్రం సుబ్రమణ్య పురం, గోపీచంద్ 25వ చిత్రం పంతం ఉన్నాయి.
మరి.. ఈ మూడు చిత్రాలైనా విజయం సాధిస్తాయో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మూడు చిత్రాలలో ముందుగా గోపీచంద్ నటిస్తున్న పంతం విడుదల కానుండగా.. ఆ తరువాత సుమంత్ సుబ్రమణ్యపురం ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది. ఇక మహేష్ 25వ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com