ఆ దర్శకుడికి అదో సరదా
Send us your feedback to audioarticles@vaarta.com
పటాస్ వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి.. రెండో చిత్రాన్ని సుప్రీమ్‌గా తెరకెక్కించి మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా రాజా ది గ్రేట్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రవితేజ తొలిసారిగా అంధుడి పాత్రలో కనిపించనున్నారు.
ఆయన చిన్నప్పటి పాత్రలో రవితేజ తనయుడు మహాధన్ దర్శనమివ్వనున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా ఓ పాటలో తళుక్కున మెరవనుంది. అంతేకాకుండా రాశితో పాటు సాయిధరమ్ కూడా ఈ పాటలో కనిపిస్తాడట.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సుప్రీమ్ సినిమాలో తన తొలి చిత్రం పటాస్ కథానాయిక శృతి సోథిని స్పెషల్ అప్పీరియన్స్ ఇప్పించిన అనిల్.. మూడో చిత్రమైన రాజా ది గ్రేట్‌లో సుప్రీమ్ హీరో హీరోయిన్లను అతిథి పాత్రల్లో కనిపించేలా చేస్తున్నాడు.
మరి తదుపరి చిత్రంలో కూడా ఇదే విధంగా రాజా ది గ్రేట్ హీరోహీరోయిన్లను గెస్ట్ రోల్స్ లో కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. ఏదేమైనా.. తన గత చిత్రాల తారలతో అతిథి పాత్రలు చేయించడం అనిల్‌కి ఓ సరదాగా మారిందనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com