నాగ్, చైతన్య.. నాలుగోసారి
- IndiaGlitz, [Monday,October 19 2015]
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే నెలలో విడుదలవడం అరుదు. ఈ నెలలో మెగా ఫ్యామిలీకి చెందిన మూడు సినిమాలు విడుదలవడం అలాంటి అరుదైన అంశమే. ఇక అక్కినేని ఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్య విషయంలో అది నాలుగోసారి రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
2010లో నాగ్ నటించిన 'కేడి', చైతన్య నటించిన 'ఏమాయ చేసావే' ఫిబ్రవరి నెలలో విడుదలయ్యాయి. ఇక 2011లో చైతన్య 'బెజవాడ', నాగ్ 'రాజన్న'డిసెంబర్ నెలలో రిలీజయ్యాయి. అదేవిధంగా 2013లో వారం రోజుల గ్యాప్లో నాగ్ 'గ్రీకువీరుడు', చైతన్య 'తడాఖా' మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇదే బాటలో ఈ డిసెంబర్లో నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా', నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలు విడుదలయ్యే దిశగా ఉన్నాయి. మొత్తమ్మీద.. తండ్రీకొడుకులిద్దరూ ఒకే నెలలో వస్తారో..లేదంటే బాగా గ్యాప్ తీసుకుంటారో చూడాలి.