ముచ్చటగా మూడోసారి..'నాన్నకు ప్రేమతో'
Send us your feedback to audioarticles@vaarta.com
'టెంపర్' వంటి బంపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం తారక్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ లుక్కే సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారి ఎటెన్షన్ పొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
విశేషమేమిటంటే.. ఈ సినిమాకి సంగీతమందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్, హీరో తారక్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రాల పరంగా.. సంక్రాంతికి వస్తున్న మూడో సినిమా ఇది. 2005లో 'నా అల్లుడు'.. 2010లో 'అదుర్స్'.. సంక్రాంతి సీజన్‌లో రిలీజయ్యాయి. వీటిలో అదుర్స్ హిట్ అయింది. అదుర్స్ తరువాత ఆరేళ్లకు వస్తున్న నాన్నకు ప్రేమతో కూడా ఆ బాటలో పయనిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com