తారక్, చెర్రీ అభిమానులకు శుభవార్తే!!
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి` దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తదుపరి ఏ సినిమా చేస్తాడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో రాజమౌళి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఈ అంచనాలను రెండింతలు చేసుకున్నారీయన. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. హీరోల క్యారెక్టర్స్ ఎలా ఉంటాయనే దానిపై పలు వార్తలు వినపడుతున్నాయి.
ఈ చిత్రం నవంబర్ 18న షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందని వార్తలు వినపడుతున్న నేపథ్యంలో లేటెస్ట్ న్యూస్ ప్రకారం నవంబర్ మొదటివారంలోనే సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేయాలని దర్శకుడు రాజమౌళి అనుకుంటున్నారట. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న తారక్, చెర్రీ అభిమానులకు సినిమా త్వరగానే షూటింగ్ స్టార్ట్ చేసుకోనుండటం శుభవార్తే కదా. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌తో పాటు మరో హీరోయిన్ కూడా కీలక పాత్ర పోషించనున్నారట. త్వరలోనే సినిమా వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments