'సోని లివ్' చాలా త్వరగా తెలుగు ఆడియెన్స్ కు రీచ్ అవుతుంది - హీరో సందీప్ కిషన్
- IndiaGlitz, [Wednesday,August 25 2021]
'సోని లివ్' ఓటీటీ చాలా త్వరగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుందని అన్నారు హీరో సందీప్ కిషన్. ఆయన నిర్మించి నటించిన వివాహ భోజనంబు సినిమాతో 'సోని లివ్' ఓటీటీ టాలీవుడ్ లోకి వస్తోంది. ఈ నెల 27న వివాహ భోజనంబు 'సోని లివ్' ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కమెడియన్ సత్య హీరోగా నటించగా..ఆర్జావీ రాజ్ నాయికగా కనిపించనుంది. వివాహ భోజనంబు సినిమా గురించి సందీప్ కిషన్ పాత్రికేయులతో ముచ్చటించారు. సోని లివ్, వివాహ భోజనంబు సినిమా గురించి సందీప్ కిషన్ చెప్పిన విశేషాలు చూస్తే...
సోని లివ్ కు నార్త్ లో బాగా ఆదరణ ఉంది. వాళ్లు తెలుగులో మా వివాహ భోజనంబు చిత్రంతో అడుగుపెడుతుండటం సంతోషంగా ఉంది. అతి తక్కువ టైమ్ లోనే సోని లివ్ కు మంచి ఆదరణ దక్కుతుందని నమ్ముతున్నాను. వాళ్ల కేటలాగ్ అలా క్రియేట్ చేస్తారు. సోని లివ్ డెబ్యూకు వివాహ భోజనంబు కరెక్ట్ ఫిల్మ్. ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ కాబట్టి కుటుంబంలోని వాళ్లంతా ఓటీటీలో మా మూవీ చూడొచ్చు.
గతేడాది మార్చిలోనే వివాహ భోజనంబు సినిమా సోని లివ్ కు అగ్రిమెంట్ చేశాం. మిగతా పెద్ద ఓటీటీలకు వెళ్లొచ్చు కానీ, ప్రతి ఓటీటీకి కాపీరైట్ పరిమితులు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలోకి తీసుకునే సోనిలివ్ కు మా సినిమా రైట్స్ ఇచ్చాం. వివాహ భోజనంబు రిలీజ్ డేట్ విషయంలోనూ నిర్ణయం చాలా రోజుల కిందట తీసుకున్నదే. ఆగస్టు 27న రిలీజ్ అవుతున్న సినిమాలతో పోటీ పడాలని, వాటిని ఇబ్బంది పెట్టాలని మేము ఎప్పుడూ అనుకోలేదు.
రామ్ అబ్బరాజు ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఇలా కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమాలో నటించడం నాకు ఇష్టం. అయితే ఇది ఒక కమెడియన్ ఇమేజ్ ఉన్న నటుడు చేస్తే బాగుంటుంది. అందుకే సత్యను ఎంచుకున్నాం. మనసులో మాత్రం నేనే ఈ కథలో నటిస్తే బాగుండును అనిపించింది. అందుకే ఓ చిన్న క్యారెక్టర్ లోనైనా కనిపించాలని నెల్లూరు ప్రభ అనే పాత్రను పోషించాను.
సత్య ఈ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు. మొత్తంగా కథను లీడ్ తీసుకున్నాడు. సత్య పర్మార్మెన్స్ రేపు ఆడియెన్స్ ను బాగా ఇంప్రెస్ చేస్తుంది. మిగతా క్యారెక్టర్స్ లో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లంతా కథలో భాగంగా నటించి ఆకట్టుకుంటారు. సినిమా షూటింగ్ టైమ్ లోనూ పండగ వాతావరణంలా ఉండేది. డజను మంది ఆరిస్టులు, ఒక ఫ్యామిలీ నిజంగానే ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది.
ఈ కథ పెళ్లికి సంబందించింది, పెళ్లిచూపులు లాంటి టైటిల్స్ వచ్చాయి. పెళ్లంటే వివాహం, చక్కగా భోజనం చేయడం..కాబట్టి వివాహ భోజనంబు అనే టైటిల్ ఠక్కున గుర్తుకొచ్చింది. అదే టైటిల్ పెట్టాం. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ రామ్ అబ్బరాజే. అతను సినిమా ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించారు.
దర్శకుడు రామ్ అబ్బరాజు తను చూసిన, తనకు తెలిసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వివాహ భోజనంబు మూవీని రూపొందించారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చూసేందుకు నేను పర్సనల్ గా బాగా ఇష్టపడతాడు. మూవీ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. నేను చేసిన నెల్లూరు ప్రభ అనే క్యారెక్టర్ లాక్ డౌన్ లో ఇల్లీగల్ గా ప్రయాణికులను తీసుకు వెళ్తుంటాడు. నెల్లూరు యాసలో మాట్లాడటం ఆస్వాదించాను.
త్వరలో గల్లీరౌడీ సినిమా థియేటర్ లలో రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో మూవీ చేస్తున్నాను. మరికొన్ని చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 3 చిత్రంలో ఓ క్యారెక్టర్ లో నటిస్తున్నాను.