‘పోకిరి’ని మించిపోతుందని.. షూటింగ్ ఫస్ట్ రోజే చెప్పా..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే సక్సెస్ మీట్ పూర్తి చేసుకున్న 'మహర్షి'.. శనివారం రోజున విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో గ్రాండ్ సక్సెస్ మీట్ చేసుకుంటున్నాడు.
కాగా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మాట్లాడుతూ తన మొదటి సినిమా మొదలుకుని 25 ఏళ్ల జర్నీ గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. షూట్ ఫస్ట్ డే ‘మహర్షి’.. పోకిరి స్క్వేర్ అవుతుందని చెప్పానని.. చెప్పినట్లుగానే హిట్టయ్యిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మహేశ్ గుర్తు చేశారు.
దుర్గమ్మను దర్శించుకుంటే..!
"విజయవాడకు వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని ఫంక్షన్‌కి వస్తే.. ఆ ఫీలింగే వేరు. ఇది నేను ఎప్పుడూ ప్లాన్ చేసింది కాదు. నా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ దుర్గమ్మ తల్లి నన్ను పిలుస్తోంది. నాకు చాలా ఆనందంగా ఉంది" అని మహేశ్ చెప్పుకొచ్చారు. కాగా ఈవెంట్‌కు ముందు చిత్రబృందం దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంది.
మామయ్యకు ధన్యవాదాలు...
"నేను 25 సినిమాలు చేశానంటే మొదటిగా మామయ్య రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నేను ‘రాజకుమారుడు’ సినిమా చేస్తున్నప్పుడు ఓ పది రోజులు పాటు ఎలా నడవాలో తెలియదు. ఎలా మాట్లాడాలో.. ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఒక ఫ్రెండ్‌లా నన్ను చూసుకున్నారు. ‘రాజకుమారుడు’ సినిమా చూసిన తరువాత కూడా నాకు ఆ సినిమా అర్ధం కాలేదు. ఇదేంటి మామయ్య సినిమా ఇలా ఉంది? అని అడిగాను.. ఇది పెద్ద హిట్ అవుతుంది. నువ్ సూపర్ స్టార్ అవుతావు అన్నారు. ఆయన అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ గారు సంయుక్తంగా నా 25వ సినిమాని ప్రొడ్యూస్ చేయడం గర్వంగా ఉంది. నాన్న గారి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు సినిమా నచ్చితే ఎలా చేస్తారో నాకు ఎప్పుడో తెలుసు. కానీ నా 25 సినిమా అన్ని బ్లాక్ బస్టర్స్‌ని దాటేసేలా చేశారు.. మీకు సలాం.. థాంక్యూ సోమచ్.. మీ గురించి మాటల్లేవ్.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప" అంటూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపేలా సూపర్ స్టార్ స్పీచ్ ఇచ్చారు.
థ్యాంక్యూ..!
"ఆంధ్రా హాస్పటల్స్ నుండి ఒకాయన వచ్చి.. హాస్పటల్లో పిల్లలకు సర్జరీ చేసేటప్పుడు హాయిగా నవ్వుతారు అని.. దీనికన్నా గొప్ప కాంప్లిమెంట్ నా జీవితంలో వినలేదు సార్. థాంక్యూ మీతో అసోషియేట్ కావడం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. అలానే హైదరాబాద్‌లోనూ ఓ ఆర్గనైజేషన్ ఉంది. సంవత్సరానికి ఎంతమంది పిల్లల్ని కాపాడుతున్నారో ఆ దేవుడికే తెలుసు. వాళ్లతో కూడా అసోషియేట్ అయ్యాం. వాళ్లతో కలిసిపనిచేయడం చాలా ఆనందం ఉంది" అని మహేశ్ చెప్పారు.
పోకిరి స్క్వేర్ అవుతుందని చెప్పా!
"వైజయంతి బ్యానర్, దిల్ రాజు గారి బ్యానర్, పివిపి గారి బ్యానర్ కలిసి నా 25వ సినిమా ప్రొడ్యూస్ చేయడం గర్వంగా ఉంది. థ్యాంక్యూ సోమచ్ నరేశ్ గారు.. పూజా హెగ్దే గారు. షూట్ ఫస్ట్ డే చెప్పాను ఇది పోకిరి స్క్వేర్ అవుతుందని.. మూడు కారక్టర్లలో నాకు బాగా నచ్చింది స్టూడెంట్ కేరక్టర్" అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. కార్యక్రమానికి వచ్చిన అభిమానులు ఈ మాటలు విని ఎగిరి గంతేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout