అది నా జీవితంలో మరచిపోలేని రోజు: చిరంజీవి
- IndiaGlitz, [Tuesday,September 22 2020]
కొణిదెల శివశంకర్ వరప్రసాద్ కాస్తా మెగాస్టార్ చిరంజీవిగా మారడం వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకూ రెండు మూడు తరాలు మారినా చిరు మాత్రం ఎప్పటికప్పుడు మా తరం వాడేనని అనిపిస్తుంటారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఫిజక్ మెయిన్టైన్ చేస్తుంటారు. అయితే మెగాస్టార్ తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ ఈ చిత్రంతో నటుడిగా చిరంజీవి జన్మించారు. అనతి కాలంలోనే మెగాస్టార్గా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.
‘ప్రాణం ఖరీదు’ చిత్రం.. 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ రోజును గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. తన జీవితంలో సెప్టెంబర్ 22కు చాలా ప్రాధాన్యం ఉందంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యం ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. ఆగస్ట్ 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబర్ 22 నటుడిగా ‘ప్రాణం (ఖరీదు)’ పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన అభిమానులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అని చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు.
#BornAsAnActor #ForeverGrateful #PranamKhareedu #thisdaythatyear pic.twitter.com/lKM1qQhpN9
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2020