మొన్న ఎన్టీఆర్ - నేడు ర‌వితేజ‌..

  • IndiaGlitz, [Thursday,May 19 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎ.పి ఆర్ 7 ఎ.ఎక్స్ 9999 కారులో ప్ర‌యాణిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ప్ర‌యాణిస్తున్న కారు అద్దాల‌కు లోప‌ల ఎవ‌రున్నారో క‌నిపించ‌కుండా ఉండేందుకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉంది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉండ‌డంతో ట్రాఫిక్ పోలీస్ కారు ఆపి ఫైన్ క‌ట్ట‌మ‌న్నాడు. బ్లాక్ ఫిల్మ్ వేసి ఉన్నందుకు ట్రాఫిక్ పోలీస్ 700 రూపాయ‌లు ఫైన్ వేసాడు. ఎన్టీఆర్ ఏమీ మాట్లాడ‌కుండానే ఫైన్ క‌ట్టారు. ఇది ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌.

ఇక నేడు మాస్ రాజ ర‌వితేజ‌కు కూడా ఇదే అనుభవం. ఈరోజు ర‌వితేజ ఏపీ 28 డీకే 4742 నంబరు గల కారులో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్ర‌యాణ‌స్తున్నారు. అయితే...ఆ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉండటంతో జూబ్లిహిల్స్ పోలీసులు కారు ఆపి.. రవితేజకు కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ను ఉపయోగించకూడదని చెప్పారు. అంతే కాదండోయ్...కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు అప్పటికప్పుడు తొలగించారు. నిబంధనల ప్రకారం రూ.800 జరిమానా విధించారు. చేసేదేమి లేక‌...ఫైన్ క‌ట్టి ర‌వితేజ అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ట‌.