అప్పుడు గౌతమ్ మేనన్..ఇప్పుడు చందు మొండేటి..
Send us your feedback to audioarticles@vaarta.com
'మనం' తరువాత సరైన విజయం లేని యువ కథానాయకుడు నాగచైతన్యకి 'ప్రేమమ్', 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాలతో ఆ లోటు తీరింది. చైతు తాజా చిత్రం 'యుద్ధం శరణం' వచ్చే నెల 8న విడుదల కానుంటే.. 'ప్రేమమ్' దర్శకుడు చందు మొండేటితో చేయనున్న రెండో చిత్రం 'సవ్యసాచి' ఇటీవలే ఆరంభమైంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తన కెరీర్ మొత్తమ్మీద ఇప్పటివరకు ఇద్దరు దర్శకులతో మాత్రమే నాగచైతన్య రెండోసారి సినిమాలు చేశాడు. వారిలో ఒకరు గౌతమ్ మేనన్ అయితే.. మరొకరు చందు మొండేటి.
'ఏమాయ చేసావే' తరువాత 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కోసం గౌతమ్ డైరెక్షన్‌లో రెండోసారి కథానాయకుడుగా నటించిన చైతన్య.. 'ప్రేమమ్' తరువాత చందు మొండేటి కాంబినేషన్‌లో 'సవ్యసాచి' చేస్తున్నాడు. గౌతమ్ కాంబినేషన్‌లో మొదటి చిత్రం మంచి విజయం సాధించింది. రెండో సినిమా మాత్రం ఆశించిన స్థాయి ఫలితం అందుకోలేదు. ఈ నేపథ్యంలో 'ప్రేమమ్'తో హిట్ కొట్టిన నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్ రెండో సినిమా విషయంలోనూ విజయం సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. విశేషమేమిటంటే.. గౌతమ్, చందు కాంబినేషన్‌లో చైతన్య రెండో చిత్రాలు ఆంగ్ల అక్షరం 'ఎస్'తోనే ప్రారంభమవ్వడం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments