అప్పుడు గౌతమ్ మేనన్..ఇప్పుడు చందు మొండేటి..

  • IndiaGlitz, [Friday,August 18 2017]

'మ‌నం' త‌రువాత స‌రైన విజ‌యం లేని యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌కి 'ప్రేమ‌మ్‌', 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాలతో ఆ లోటు తీరింది. చైతు తాజా చిత్రం 'యుద్ధం శ‌ర‌ణం' వ‌చ్చే నెల 8న విడుద‌ల కానుంటే.. 'ప్రేమ‌మ్' ద‌ర్శ‌కుడు చందు మొండేటితో చేయ‌నున్న రెండో చిత్రం 'స‌వ్య‌సాచి' ఇటీవ‌లే ఆరంభ‌మైంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. త‌న కెరీర్ మొత్త‌మ్మీద ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో మాత్ర‌మే నాగ‌చైత‌న్య రెండోసారి సినిమాలు చేశాడు. వారిలో ఒక‌రు గౌత‌మ్ మేన‌న్ అయితే.. మ‌రొక‌రు చందు మొండేటి.

'ఏమాయ చేసావే' త‌రువాత 'సాహసం శ్వాస‌గా సాగిపో' చిత్రం కోసం గౌత‌మ్ డైరెక్ష‌న్‌లో రెండోసారి క‌థానాయ‌కుడుగా న‌టించిన చైత‌న్య‌.. 'ప్రేమ‌మ్' త‌రువాత చందు మొండేటి కాంబినేష‌న్‌లో 'స‌వ్య‌సాచి' చేస్తున్నాడు. గౌత‌మ్ కాంబినేష‌న్‌లో మొద‌టి చిత్రం మంచి విజ‌యం సాధించింది. రెండో సినిమా మాత్రం ఆశించిన స్థాయి ఫ‌లితం అందుకోలేదు. ఈ నేప‌థ్యంలో 'ప్రేమ‌మ్‌'తో హిట్ కొట్టిన నాగ‌చైతన్య‌, చందు మొండేటి కాంబినేష‌న్ రెండో సినిమా విష‌యంలోనూ విజ‌యం సాధిస్తారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. విశేష‌మేమిటంటే.. గౌత‌మ్, చందు కాంబినేష‌న్‌లో చైత‌న్య రెండో చిత్రాలు ఆంగ్ల అక్ష‌రం 'ఎస్‌'తోనే ప్రారంభ‌మ‌వ్వ‌డం.

More News

'ఉయ్యాలవాడ..' తో అధిగమిస్తాడా?

'ఖైదీ నెం.150' తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.

లక్ష్మి మంచు ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెం.4 ప్రారంభం

ప్రతీ చిత్రంతోనూ వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ,నటిగా,నిర్మాతగా,సమాజ సేవకిగా పేరుపొందిన మంచు లక్ష్మి ప్రధాన పాత్ర లో

బిగ్ బాస్ షోలో సందడి చేసిన తాప్సీ

ఆనందో బ్రహ్మ ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీబ్యూటీ తాప్సీ పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్నారు.

చిరుకే కాదు తనక్కూడా..

గతేడాది ఏ సినిమా చేసినా.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి నిరాశే ఎదురైంది. అయితే ఈ ఏడాది మాత్రం కాజల్కి అనుగుణంగానే ఉంది.. ఇప్పటివరకు.

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా చిత్రం ప్రారంభం

మూడు దశాబ్దాలుగా ఎందరో స్టార్ హీరోల సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా