సినీ ఇండస్ట్రీ పై ఐటీ దాడులు.. ఎంత డబ్బు పట్టుకున్నారో తెలుసా!
- IndiaGlitz, [Friday,February 07 2020]
సినీ ఇండస్ట్రీపై ఐటీ శాఖ దాడులు చేసిందా? అదేంటి? అదెప్పుడు అనే సందేహాలు రాక మానవు. నిజానికి ఐటీ శాఖ దాడులు చేసింది టాలీవుడ్‌లో కాదు.. కోలీవుడ్‌లో. రెండు రోజుల నుండి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఓ ప్రముఖ తమిళ నిర్మాత, హీరోలు సంబంధిత ఫైనాన్సియర్, వ్యక్తులపై దాడులు చేశారు. గురువారంనాడు ప్రముఖ ఫైనాన్సియర్ ఇళ్లపై దాడులు చేసిన ఐటీ శాఖ దాదాపు రూ.300 కోట్ల రూపాయల నల్లధనాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. బుధవారం రోజున బిగిల్ సినిమా నిర్మాణ సంస్థ ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, హీరో విజయ్‌ను ఐటీ అధికారులు గట్టిగా ప్రశ్నించారు. తర్వాత ఫైనాన్సియర్ అన్బు సెల్వన్ ఇళ్లు, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు జరిగాయి.
అన్బు చెలియన్ మధురై ఆఫీసుల్లో ఐటీ దాడుల్లోషాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 38 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేసినప్పుడు రూ.77 కోట్ల మేరకు నల్లధనాన్ని పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ప్రామిసరీ నోట్స్, పోస్ట్ డేటెడ్ చెక్స్, ఆస్థుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడులపై హీరో విజయ్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కోణంలోనే విజయ్‌పై దాడులు జరిగాయని వారు సోషల్ మీడియాలో తమ నిరసనలను వ్యక్తం చేశారు. మరి దీనిపై హీరో విజయ్ మాత్రం ఎక్కడా స్పందించలేదు.