రష్మిక ఇంటిపై ఐటీ సోదాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం అగ్ర కథానాయికగా టాలీవుడ్‌లో రాణిస్తున్న కన్నడ కథానాయకి రష్మిక మందన్న. ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరుతో మరో సూపర్‌హిట్ చిత్రాన్నిన తన ఖాతాలో వేసుకుంది. ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే ఆమెకు ఐటీ దాడుల రూపంలో షాక్ తగిలింది. కర్ణాటక కూర్గ్‌లోని రష్మిక మందన్న ఇంటిపై గురువారం ఐటీ అధికారులు సోదాలు చేశారు. ప్రస్తుతం అగ్ర కథానాయకులు సరసన నటిస్తోన్న అ అమ్మడుకి మంచి రెమ్యునరేషనే దక్కుతుందని వార్తలు వినపడుతున్నాయి. మరి రష్మిక మందన్న.. ఆమె కుటుంబ సభ్యులెవరూ దీనిపై స్పందించలేదు.
కన్నడలో కిరిక్ పార్టీతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది రష్మిక మందన్న. తర్వాత ఈమె తెలుగులో `ఛలో` ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజయం సాధించడంతో పాటు రష్మిక అందం, అభినయం ఆకట్టుకోవడంతో ఆమెను తమ సినిమాలో హీరోయిన్‌గా నటింప చేయాలని పలువురు దర్శక నిర్మాతలు భావించారు. అదే సమయంలో విడుదలైన గీత గోవిందంలో రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో మహేశ్ సినిమా `సరిలేరు నీకెవ్వరు`లో అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే తమిళంలో కార్తి సరసన నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments