హీరో నాని ఇంటిపై ఐటీ దాడులు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌పై ‘ఐ’టీ ఓ కన్నేసింది.. ఇవాళ ప్రముఖ రామానాయుడు స్టూడియో, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబుకు చెందిన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన కార్యాలయాలు, ఇంటిపై ఐటీ అధికారులు మెరుపుదాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆడిటర్లు సమక్షంలో అధికారులు సోదాలు సాగిస్తున్నారు. అయితే ఏకకాలంలో పలు బృందాలుగా విడిపోయిన అధికారులు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు, నిర్మాతలపై ఇళ్లపై సోదాలు చేస్తున్నారు. ఫలానా వారి ఇంటిపై ఐటీ దాడులు అని క్లారిటీ రాలేదు కానీ.. పుకార్లు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి.
తాజాగా.. టాలీవుడ్ ప్రముఖ హీరో నేచురల్ స్టార్ నాని ఇంటిపై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. మొదట ఓ ప్రముఖ హీరో ఇంట్లో అని వార్తలు వచ్చినప్పటికీ ఫైనల్‌గా ఆ ప్రముఖుడు నాని అని తెలియవచ్చింది. ఇవాళ ఉదయం 7గంటలకే నాని ఇంటికి చేరుకున్న అధికారులు ఐటీ సోదాలు చేస్తున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్ లోని నాని నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
కాగా.. టాలీవుడ్ స్టార్ హీరోల నాని కూడా ఒకరుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఈ మధ్యే నిర్మాతగా కూడా మారారు. ఏడాదికి సుమారు రూ.30 కోట్లకు పైగా నాని సంపాదిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఒక్కో సినిమాకు సుమారు రూ. 10 కోట్లు పుచ్చుకుంటాడని సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలోనే నాని మూడు సినిమాలకు సైన్ చేశారు. అయితే ఐటీ దాడులకు సంబంధించి ఇంతవరకూ నాని రియాక్ట్ అవ్వలేదు. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com