MP Ponguleti:చెప్పినట్లే జరిగింది.. మాజీ ఎంపీ పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఓవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కేఎల్‌ఆర్, పారిజాత నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇవాళ ఉదయం ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో ఐటి, ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాలలో అధికారులు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఐటీ అధికారుల దాడుల గురించి బుధవారమే పొంగులేటి కామెంట్స్ చేశారు. తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు కొన్ని రోజులు తప్పవని వ్యాఖ్యానించారు. ఆయన అలా చెప్పిన మరుసటి రోజే ఐటీ దాడులు జరగటం కలకలం రేపుతోంది. ఎన్నికల్లో ప్రజలు తమ వైపు ఉన్నారని.. తమను ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలని అధికార బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఐటీ దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పాలేరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున పొంగులేటి బరిలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ లోపే ఐటీ దాడులు జరగటం పట్ల ఆయన అభిమానులు, శ్రేణులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలపై ఐటీ సోదాలు నేపథ్యంలో ప్రచారం మరింత రసవత్తరంగా జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout