‘మహర్షి’ రిలీజ్‌కు ముందు దిల్‌రాజుకు ‘ఐటీ’ షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఐటీ (ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్) అధికారులు షాకిచ్చారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’ మూవీ రేపు అనగా మే-09న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దిల్‌రాజుతో పాటు మరో ఇద్దరు పెద్దలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ‘మహర్షి’ సినిమా విడుదల కానున్న సమయంలో ఆ చిత్ర నిర్మాత దిల్‌రాజు కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది.
సాగర్ సొసైటీలోని దిల్‌రాజ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే ఐదుగురు సభ్యుల బృందంతో దిల్‌రాజు కార్యాలయాలకు వెళ్లిన అధికారులు రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. రేపు మహర్షి సినిమా విడుదల కానున్న సమయంలో ఆదాయ వ్యయాలపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా.. మహర్షి చిత్రానికి ముగ్గురు నిర్మాతలు కలిసి మొత్తం రూ. 130 కోట్ల రూపాయలతో నిర్మించారు.
ఆ ఇద్దరికీ ఐటీ షాక్ తప్పదా..?
అయితే.. దిల్‌రాజు కార్యాలయంతో పాటు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఎఫ్2 సినిమా కూడా బాక్స్‌ఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం విదితమే. దీంతో గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సోదాల గురించి ఇంత వరకు దిల్‌రాజు గానీ.. ఐటీ అధికారులుగానీ వివరాలు వెల్లడించలేదు. అయితే మహర్షి చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన మరో ఇద్దరు నిర్మాతల కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తారని సమాచారం.
అసలేం జరుగుతోంది..!
మొత్తానికి చూస్తే ‘మహర్షి’ సినిమా రిలీజ్ రెండ్రోజుల ముందు నుంచి తెలంగాణలో పెద్ద హడావుడే జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఓ వైపు థియేటర్ల యాజమాన్యం టికెట్లు పెంచేయడం.. మరోవైపు ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకోవడం.. సర్కార్ కోర్టుమెట్లెక్కెందుకు సిద్ధమవ్వడం.. తాజాగా మహర్షి నిర్మాత దిల్‌రాజు ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేయడం ఈ వ్యవహారం మొత్తం ఓ సీరియల్‌లా జరుగుతుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మున్ముంథు ఇంకా ఏమేం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout