శృతిని వారే వద్దని అనుకున్నారట...

  • IndiaGlitz, [Saturday,June 24 2017]

బాహుబ‌లి త‌ర్వాత ద‌క్షిణాదిన ప్ర‌క‌టించిన మ‌రో భారీ చిత్రం సంఘ‌మిత్రం. శృతిహాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డానికి రెడీ అయిపోయంది. సినిమా కోస‌మ‌ని లండ‌న్‌లో క‌త్తిసాములో శిక్ష‌ణ కూడా తీసుకుంది. సినిమా అనౌన్స్ చేసిన రెండో రోజునే శృతిహాస‌న్ సినిమా నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బౌండెడ్ స్క్రిప్ట్స్ ఇంకా ఇవ్వ‌లేదనే కార‌ణంతో త‌ప్ప‌కుంటున్న‌ట్లు శృతిహాస‌న్ ప్ర‌క‌టించింది.

అయితే నిర్మాణ సంస్థ హేమా రుక్మిణి ఇప్పుడు ఈ విష‌యంపై నోరు విప్పారు. సంస్థే శృతితో క‌లిసి ప‌నిచేయ‌లేమ‌ని మేం నిర్ణ‌యించుకున్నాం. క‌థ‌, స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ ఫైన్ చేయ‌డం త‌ర్వాత జ‌రిగిపోతుందన్నారు. శృతి స్థానంలో న‌య‌న‌తార ఇప్పుడు సంఘ‌మిత్రలో న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. న‌య‌న‌తార గొప్ప న‌టి. సంఘ‌మిత్ర లుక్ ఎలా ఉండాల‌నే దానిపై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాం. త్వ‌ర‌లోనే సంఘ‌మిత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌ని విష‌యం తెలియ‌జేస్తామంటూ హేమా తెలిపారు.