అప్పుడు గురువు.. ఇప్పుడు శిష్యుడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకే సంగీత దర్శకుడు సంగీతమందించిన మూడు చిత్రాలు ఒకే వారంలో సందడి చేయడమనేది అరుదుగా జరుగుతుంది. గతంలో ఇలాంటి పరిస్థితి సంగీత దర్శకుడు మణిశర్మ అనుభవంలోకి రాగా.. ఇప్పుడు ఆయన శిష్యుడు తమన్ కూడా ఇదే పరిస్థితిని చూడబోతున్నారు. కాస్త వివరాల్లోకి వెళితే.. 2001 సంక్రాంతికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించిన మూడు చిత్రాలు సందడి చేశాయి. ఆ మూడు చిత్రాలు కూడా అగ్ర కథానాయకుల చిత్రాలే కావడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది.
చిరంజీవి నటించిన మృగరాజు, బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు, వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు.. ఇలా మణి సంగీత సారథ్యంలో రూపొందిన మూడు సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన శిష్యుడు తమన్ సంగీత సారథ్యంలో మూడు సినిమాలు.. సంక్రాంతికి కాదు కానీ మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ కానున్నాయి. ఇంతకీ చిత్రాలేమిటంటే.. మోహన్ బాబు నటించిన గాయత్రి, సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్, వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ. వీటిలో గాయత్రి, ఇంటిలిజెంట్ ఈ నెల 9న విడుదల కానుండగా.. తొలి ప్రేమ ఈ నెల 10న రిలీజ్ కానుంది. మొత్తానికి గురువు బాటలోనే శిష్యుడు కూడా పయనిస్తున్నాడన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com