'జనతాగ్యారేజ్ ' కి కూడా అలాగే..
Send us your feedback to audioarticles@vaarta.com
'టెంపర్', 'నాన్నకు ప్రేమతో' చిత్రాల కోసం వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి.. అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించాడు ఎన్టీఆర్. ఈ రెండు చిత్రాల తరువాత 'జనతా గ్యారేజ్' కోసం మరో డిఫరెంట్ పాత్రని చేస్తూ బిజీగా ఉన్నాడీ యువ కథానాయకుడు. 'మిర్చి', 'శ్రీమంతుడు' వంటి రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాల తరువాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
1994లో వచ్చిన 'గాండీవం' చిత్రం కోసం ఓ పాటలో మెరిసిన మోహన్‌లాల్.. మళ్లీ 22 ఏళ్ల తరువాత తెలుగు తెరపై సందడి చేస్తున్న సినిమా ఇదే కావడంతో తెలుగు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశేషమేమిటంటే.. బాలకృష్ణతో మోహన్‌లాల్ నటించిన 'గాంఢీవం' ఏ ఆగస్టులో రిలీజైందో.. తారక్‌తో లాల్ నటించనున్న 'జనతా గ్యారేజ్' కూడా అదే నెలలో రిలీజ్‌కి సిద్ధమవుతుండడం. భారీ అంచనాల మధ్య వచ్చిన 'గాండీవం' అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'జనతా గ్యారేజ్' ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments