జెనీలియాకు మళ్లీ కొడుకు పుట్టాడు..
- IndiaGlitz, [Wednesday,June 01 2016]
సత్యం, సై, సాంబ, హ్యాపీ, బొమ్మరిల్లు, రెఢీ...తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కధానాయిక జెనీలియా. సినిమాలకు గుడ్ బై చెప్పేసి రితేశ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తొలిసారి మగబిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా మళ్లీ రెండోసారి కూడా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జెనీలియ భర్త రితీశ్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. తన కొడుకు రియాన్ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. మమ్మీ, డాడీ నాకు తమ్ముడిని ఇచ్చారు. ఇక నా బొమ్మలన్నీ వాడివే అంటూ కొడుకు రియానే చెబుతున్నట్లు సరదాగా రితేశ్ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా హీరో సుమంత్ జెనీలియాకు కంగ్రాట్స్ తెలియచేసారు.