ప్రభాస్ కజిన్ కూడా వస్తున్నాడు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఐదేళ్ళ క్రితం విడుదలైన కెరటం సినిమా చాలా మందికి గుర్తుండక పోవచ్చు. అందులో మన యంగ్ రెబల్ స్టార్ కజిన్ సిద్ధార్థ్ రాజ్ కుమార్ లీడ్ రోల్లో నటించాడు. ఆ సినిమా అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఆ సినిమా తర్వాత సిద్ధార్థ్ మరే సినిమాలో నటించలేదు. ఇప్పుడు మళ్ళీ సిద్ధార్థ్ రాజ్‌కుమార్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించనున్న చిత్రం ద్వారా ఈ యువ హీరో ఎంట్రీ ఉంటుంది. దర్శకుడెవరనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయట. అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ గురించి న్యూస్ బయటకు వస్తుంది. సెకండ్ ఎంట్రీ సిద్ధార్థ్‌కు ఎలాంటి బ్రేక్ తీసుకొస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments