నితిన్ కి అతనితో అస్సలు అచ్చి రావడం లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
అదేంటో గాని.. కొన్ని కాంబినేషన్లు ఎన్ని సార్లు కలిసి పనిచేసినా వర్కవుట్ కావు. అలాంటి కాంబినేషన్లో కథానాయకుడు నితిన్, సంగీత దర్శకుడు మణిశర్మని చేర్చుకోవచ్చు. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రమైన శ్రీ ఆంజనేయం నుంచి తాజా చిత్రం లై వరకు ఇదే పరిస్థితి. దీంతో ఈ కాంబినేషన్ ఫ్లాప్ కాంబినేషన్గానే కంటిన్యూ అవుతోంది. నితిన్ తన సైడ్ నుంచి ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నా.. మణి ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయా సినిమాలకు ప్లస్ అవుతున్నా.. సినిమాలు మాత్రం హిట్ ట్రాక్ ఎక్కడం లేదు.
శ్రీ ఆంజనేయం, హీరో, రెచ్చిపో, మారో, లై.. ఇలా ఇప్పటివరకు ఐదు సార్లు కలిసి పనిచేసిన నితిన్, మణిశర్మ కాంబోకి తదుపరి చిత్రంతోనైనా హిట్ దొరుకుతుందో లేదంటే ఫ్లాప్ కాంబినేషన్గానే నిలిచిపోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. అన్నట్టు.. ధైర్యం, ద్రోణ, సీతారాముల కళ్యాణం లంకలో.. ఇలా మూడు ఫ్లాప్ చిత్రాల తరువాతే నితిన్, అనూప్ కాంబినేషన్‌కి ఇష్క్‌తో వర్కవుట్ అయింది. ఇది నితిన్, మణి కాంబినేషన్‌కి కూడా భవిష్యత్‌లో వర్తిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments