రవితేజ కథ అది కాదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా ఏడాది పాటు హాలీడేస్‌ను ఎంజాయ్ చేశాడు. వచ్చే ఏడాది కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. అనిల్ రావిపూడి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రవితేజ. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ సినిమాలో రవితేజ్ గుడ్డివాడుగా నటించబోతున్నాడు. అయితే రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందాల్సి ఉంది.
ఆ సినిమా కథలో కూడా రామ్ గ్రుడ్డివాడుగా నటించాల్సింది. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అదే కథను రవితేజ్ ఓకే చేశాడని వార్తలు వినిపించాయి. కానీ రవితేజ్ ఒప్పుకున్న కథ వేరుగా ఉందట. క్యారెక్టర్ ఒకేలా ఉండటంతో ఈ వార్తలు వచ్చాయని, ప్రస్తుతానికి సినిమా స్క్రిప్ట్ రూపొందుతోందని సమాచారం. ఈ సినిమాలో రవిజతేజ సరసన మెహరీన్ హీరోయిన్గా నటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments