ప్రకాష్ రాజ్ కి కుదరడం లేదట...

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరో అవకాశాన్ని వదులుకున్నాడు. అందుకు కారణం డేట్స్ సమస్యనేట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తెలియజేశాడు. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి' చిత్రంలో నటించే అవకాశం. ఇప్పటి వరకు రజనీకాంత్ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్ర ఎప్పుడూ చేయని ప్రకాష్ రాజ్ ఈ సినిమా అవకాశం వచ్చిన్నప్పుడు యూనిట్ వాళ్ళు 60 రోజులు పాటు డేట్స్ కావాలని అడిగారట.

అయితే ప్రస్తుతం తాను పది సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని అన్ని రోజుల పాటు డేట్స్ కేటాయించడం చాలా కష్టమనే విషయం నాకు అర్థమైంది. అందుకే అవకాశాన్ని వదులుకున్నాను. చాలా మంచి కథ, రజనీకాంత్ గారి కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. రెండు సినిమాలు, రెండు మరాఠీ, ఓ పిల్లల చిత్రం ఇలా పది భాషల చిత్రాల్లో నటిస్తున్నాను. అందుకనే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడట. గతంలో నరసింహ' సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన ప్రకాష్ రాజ్ కి ఈ సినిమాలో పూర్తి నిడివి ఉన్న పాత్ర వచ్చినా చేయలేకపోవడం ఓ రకంగా దురదృష్టమేనని చెప్పాలి.

More News

కమర్షియల్ కమల్...

తనదైన నటనతో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన కమల్ హాసన్ సోషల్ అవెర్ నెస్ కలిగించే యాడ్స్ లో తప్ప ఐదు దశాబ్దాల నట జీవితంలో ఎన్నడూ కమర్షియల్ యాడ్ లో కనపడలేదు.

మెగా ఫ్యాన్స్ కు ఒకే రోజు రెండు పండగలు...

మెగా ఫ్యాన్స్ ఒకే రోజు రెండు పండగలు..రానున్నాయి. ఇంతకీ ఆ..రెండు పండగలు ఏమిటి..?

'పులి' సెన్సార్ రిపోర్ట్ ఏమిటి...?

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం పులి. ఈ చిత్రంలో విజయ్ సరసన హాన్సిక, శ్రుతిహాసన్ నటించారు.

నితిన్ కొత్త సినిమా ప్రారంభం ఎప్పుడు...?

నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం అ ఆ.టైటిల్ వెరైటగా ఉంది.అ ఆ అంటే అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి.

కొరటాలకు 'శ్రీమంతుడు' కానుక...

'నేనొక్కడినే','ఆగడు' సినిమా ఫెయిల్యూర్స్ తో మహేష్ లో ఓ రకమైన బెంగ పట్టుకుందనే చెప్పాలి.