ఇది శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే.. ప్లీజ్.. ప్లీజ్: చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
ఏవో చిన్నాచితకా సినిమాలు తప్ప పెద్దగా షూటింగ్స్ ఏమీ మొదలు కాలేదు. దీంతో సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ‘సీసీసీ’ మరోసారి కార్మికులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశం ద్వారా స్వయంగా వెల్లడించారు. ఈ పరిస్థితి శాశ్వతం కాదని.. తాత్కాలిక కష్టమేనని సినీ కార్మికులకు ధైర్యం చెప్పారు. మహా అయితే కొద్ది రోజుల పాటు ఎదుర్కొని ధైర్యంగా నిలబడదామన్నారు. మనకేం కాదులే.. మనకేం రాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అస్సలు పనికి రాదన్నారు. అనుక్షణం మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ.. మీ కుటుంబానికి రక్షణగా ఉండండాలని చిరు అర్థించారు.
‘‘షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పని లేక చేతిలో డబ్బాడక.. సినీ కార్మికుల పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అందుకే సీసీసీ తరుఫున మూడో సారి కూడా కార్మికులందరికీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా మొదలు పెట్టేశాం. ఇక్కడున్న అన్ని అసోసియేషన్లు, యూనియన్లు.. సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్‌కి ఎప్పటిలాగే.. ఇస్తూనే ఈ సారి రెండు రాష్ట్రాల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో కూడా రిప్రజెంటేటివ్స్‌కి అలాగే పోస్టర్స్ అంటించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం కలిపి దాదాపుగా పది వేల మందికి అందివ్వడం జరుగుతుంది.
ఈ సమయంలో అందరికీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే. మహా అయితే కొద్ది రోజుల పాటు ఎదుర్కొని ధైర్యంగా నిలబడదాం. పని చేసుకుంటూ సంతోషంగా గడిపే రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ కుటుంబానికి ఇప్పుడు కావల్సింది మీ అందరి ఆరోగ్యం. మనకేం కాదులే.. మనకేం రాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అస్సలు పనికి రాదు.. అనుక్షణం మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ.. మీ కుటుంబానికి రక్షణగా ఉండండి.. ప్లీజ్.. ప్లీజ్.. ఈ వినాయకచవితి పండుగను అందరం సంతోషంగా జరుపుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించాలి.. యథావిధిగా మేమంతా పని చేసుకుంటూ సంతోషంగా ఉండాలని ఆ వినాయకున్ని కోరుకుందాం. అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments