వందేళ్లకోసారి మాత్రం ఇలాంటి వర్షం పడే అవకాశం: కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
1908లో మూసీకి వరదలు వచ్చాయని.. నాడు ఒకే రోజు 43 సెంటీమీటర్లు వర్షం పడిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో సగటున ఏటా 78 సెం.మీ. వర్షం పడుతోందని, ఈ ఏడాది ఇప్పటికే 80 శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. నగర చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వర్షమని కేటీఆర్ తెలిపారు. వందేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. క్యుములోనింబస్ మేఘాలతో ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షం పడుతోందన్నారు. వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని, వేలాది మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
రాబోయే మూడు రోజులు మరింత వర్షం కురిసే అవకాశం ఉందని కేటీఆర్ వెల్లడించారు. 80 మంది సీనియర్ అధికారులు వరద సహాయక చర్యల్లో పాల్గొంటారని తెలిపారు. వీరంతా ప్రాణ నష్టం జరగకుండా చూస్తారన్నారు. పునరావస కేంద్రాల్లో భోజనం, వైద్య సేవలు అందిస్తామని.. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కిట్ అందిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, సహాయక చర్యల కోసం ఇప్పటికే రూ.60 కోట్లు ఖర్చు చేశామని... ఇంకా 670 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇప్పటికీ కొన్ని కాలనీలతో పాటు అపార్టుమెంట్లలో నీరు నిలిచి ఉందని కేటీఆర్ తెలిపారు.
వరద సహాయక చర్యల కోసం బోట్లను సైతం అందుబాటులో ఉంచినట్టు కేటీఆర్ తెలిపారు. ఆర్మీకు సమాచారం అందించామని.. హెలికాఫ్టర్లను సైతం సిద్ధంగా ఉంచామన్నారు. పునరావాస కేంద్రాల్లో కరోనా టెస్టులు కూడా చేస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. వారి కోసం సామాజిక భవనాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. మొబైల్ టాయిలెట్లను కూడా అందుబాటులో ఉంచాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో వరదల కారణంగా 70 మంది మృతి చెందారని కేటీఆర్ తెలిపారు. కాగా.. ఇంతవరకూ కేంద్రం స్పందించలేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com