కన్ ఫర్మ్ అయినట్టే....
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్ శతమానం భవతి సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయిపోగానే శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. గీతాఆర్ట్స్ బ్యానర్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయట. దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయినట్టేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారక సమాచారం త్వరలోనే వెలువడనుంది. భలే భలే మగాడివోయ్ సినిమా తరహాలో ఈ సినిమా ఎంటర్‌టైనింగ్ వేలో ఉంటుందట. బాబు బంగారం తర్వాత మారుతి దర్శకత్వంలో వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments