BRS Party: బీఆర్ఎస్ పార్టీదే మళ్లీ అధికారం.. న్యూస్‌టాప్ సర్వేలో స్పష్టం

  • IndiaGlitz, [Wednesday,November 22 2023]

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని న్యూస్ టాప్ సర్వే తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం నవంబర్ 16 నుంచి 21 మధ్య ఈ సర్వే చేశామని.. 1,19,000 శాంపిల్స్ తీసుకున్నామని సంస్థ ప్రకటించింది. ఇందులో బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుతున్నట్లు తేలిందని తెలిపింది. అయితే గత ఎన్నికల కంటే సీట్లు తగ్గుతాయని పేర్కొంది. సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ 65-71 సీట్లు.. కాంగ్రెస్ పార్టీకి 32-41, బీజేపీకి 3-4, ఎంఐఎం పార్టీకి 5-7 సీట్లు, బీఎస్పీ 0-1, సీపీఐకి 0-1 సీట్లు వస్తాయని.. 11చోట్ల హోరాహోరి పోరు ఉంటుందని వెల్లడించింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల మెజార్టీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. అయితే కొంతమంది మాత్రం డబుల్ బెడ్ రూం, రైతుబంధు, జాబ్ నోటిఫికేషన్స్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారని తెలిపింది. అయితే ఈ అసంతృప్తి మాత్రం అధికారం దూరం చేసేంత లేదు అని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పథకాల గురించి నెగిటివ్ ప్రచారం చేయడంతో సీట్లు మాత్రం తగ్గుతాయని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కంటే ఈసారి అనూహ్యంగా ఓట్ షేర్ పెంచుకుంటుందని పేర్కొంది. కానీ ఆ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో పాటు నాయకత్వ లోపం పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుందని వివరించింది. అంతేకాకుండా సీఎం రేసులో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం కూడా మైనస్ అని తెలిపింది. ఇక కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ పథకాలను నుంచి కాపీ కొట్టారని ప్రజలు భావిస్తున్నట్లు చెప్పింది. అలాగే కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పథకాలను నెరవేర్చడంలో విఫలం కూడా ఆ పార్టీని తెలంగాణలో అధికారానికి దూరం చేసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది.

బీజేపీకి గత ఎన్నికల్లో కంటే ఈసారి ఓట్ శాతం పెరిగి 5 సీట్లు వరకు రావొచ్చని తెలిపింది. దుబ్బాక, హుజురాబాద్, గోషామహల్, బోథన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో కమలం పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని వెల్లడించింది.

ఇక ఎంఐఎం పార్టీ ఎప్పటిలాగే పాతబస్తీలో తన ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటుందని వివరించింది. అయితే ఈసారి మాత్రం నాంపల్లి సీటును కోల్పోయే ప్రమాదం ఉందంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఫిరోజ్ ఖాన్ గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది. బీఎస్పీ నుంచి సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచే పరిస్థితి కూడా ఉందని పేర్కొంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తు్న్న సీపీఐ కొత్తగూడెం నుంచి గెలవొచ్చనే అభిప్రాయం వ్యక్తంచేసింది.

ఇదిలా ఉంటే మంచిర్యాల, నిర్మల్, బాల్కొండ, నారాయణఖేడ్, మునుగోడు, ములుగు, ఖమ్మం, మల్కాజ్‌గిరి, కల్వకుర్తి, గద్వాల్, షాద్ నగర్ నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరి పోటీ ఉంటుందని వెల్లడించింది. మొత్తానికి ఈ సర్వే ప్రకటించిన విశ్లేషణ ప్రకారం బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి పవర్‌లోకి రావడం ఖాయమని తెలిపింది.

More News

ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా.. బీసీ సీఎంను చూడాలి: పవన్

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య నువ్వానేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో

Akbaruddin Owaisi: పోలీసులను బెదిరించడంతో అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో నేతలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ

Chandrababu: సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది..? చంద్రబాబు భవితవ్యంపై సస్పెన్స్..?

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 29 నుంచి రాజకీయ కార్యకలాపాలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.

Naga Chaitanya: అభిమానుల ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసిన నాగచైతన్య

అక్కినేని హీరో నాగచైతన్య తొలిసారిగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దూత' అనే వెబ్ సిరీస్ చేశాడు. చైతూ మొదటిసారి మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో చేస్తుండటంతో