ఎన్టీఆర్ బయోపిక్ కోసం ...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. ఈ దివంగత ముఖ్యమంత్రి జీవిత చరిత్రను 'యన్.టి.ఆర్ కథానాయకుడు', 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో 'యన్.టి.ఆర్ కథానాయకుడు'లో బొబ్బిలిపులి, దానవీర శూరకర్ణ, వేటగాడు, గుండమ్మ కథ సహా పలు చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆసక్తికరమైన విషయమేమంటే ఈ ఏపిసోడ్స్కు సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ వాయిస్‌ను రీ క్రియేట్ చేసి ఉపయోగించాలనుకుంటున్నారట. ఇది కచ్చితంగా వర్కవుట్ అవుతుందని క్రిష్ భావిస్తే దానికి బాలకృష్ణ కూడా సపోర్ట్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments