అది ఓ భర్త జరుపుతున్న మౌనపోరాటం.. ఎక్కడో కాదు..
- IndiaGlitz, [Saturday,July 25 2020]
హీరోయిన్ యమున నిర్వహించిన ‘మౌన పోరాటం’ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసింది. అప్పటి నుంచి మహిళలు.. ప్రియుడి కోసమో.. భర్త కోసమో.. మౌనపోరాటాలు జరపడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఓ భర్త తన భార్య కోసం మౌనపోరాటం నిర్వహించడం మాత్రం ఆసక్తికరంగా మారింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇది ఏ నార్త్ ఇండియాలోనో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తెలంగాణలో.. కచ్చితంగా చెప్పాలంటే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌లో జరిగింది.
రాంకరన్ అనే వ్యక్తి మంచిర్యాలకు చెంది. లేఖాశర్మను 2014 ఆగస్టు 23న కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని సీతారాముల దేవస్థానంలో పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఐదేళ్లుగా సాఫీగా.. ఆనందంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో పెను తుఫాన్ వచ్చింది. ఇటీవల లేఖను తప్పనిసరి పరిస్థితుల్లో రాంకరన్ ఆమె పుట్టింటికి పంపించాడు. పుట్టింట్లో కొద్ది రోజులు గడిపిన లేఖ సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. తనకు రాంకరన్‌తో కాపురం నచ్చలేదని ఏకంగా డివోర్స్ నోటీస్ పంపించింది. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని భావించిన రాంకరన్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. దీంతో భార్యను కాపురానికి రావాలని ప్రాథేయపడినా.. ప్రయోజనం లేకపోవడంతో ఆమె పుట్టింటి ఎదుటే రాంకరన్ మౌనపోరాటానికి దిగాడు. మరి అతని ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.