పవన్ కళ్యాణ్ కిదే తొలిసారి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినీ పరిశ్రమలో ఓ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. అదేమిటంటే.. మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులకు రెండో సినిమాలతో అదే మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టమని. ఎవరో అతి కొద్ది మంది మాత్రమే ఈ సమస్యను అధిగమించారు. చాలా మంది మాత్రం చేతులెత్తేశారు. తొలిసినిమాతో హిట్ కొట్టి.. ఇప్పుడు రెండో సినిమాతో బిజీగా ఉన్న దర్శకులలో బాబీ ఒకరు.
'పవర్'తో మంచి హిట్ కొట్టిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆసక్తికరమైన అంశమేమిటంటే.. పవన్ కళ్యాణ్ దర్శకుల జాబితాలో ఇప్పటివరకు ఇలా తమ రెండో దర్శకత్వ ప్రయత్నం చేసినవారెవరూ లేరు. మరి ఆ లిస్ట్‌లో తొలి స్థానం పొందుతున్న బాబీ.. పవన్ అండదండలతో ద్వితీయ విఘ్నాన్ని అవలీలగా అధిగమిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com