Barrelakka: పవన్ కల్యాణ్‌ గురించి అలా మాట్లాడటం బాధేసింది: బర్రెలక్క

  • IndiaGlitz, [Monday,December 18 2023]

బర్రెలక్క.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. సోషల్ మీడియాలో బర్రెల్కకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో గెలవకపోయినా ఆమె పోరాటస్ఫూర్తికి సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఇండిపెడెంట్‌గా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 5,754 ఓట్లు పొందడం సాధారణమైన విషయం కాదని కొనియాడుతున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ తెలంగాణలో పోటీ చేసిన జనసేన పార్టీకి అక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్దమనిషికి రాలేదని సెటైర్లు వేశారు. దీంతో వైసీపీ-జనసేన శ్రేణుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్క సీటు లేకపోయినా తాము హుందాగా తెలంగాణలో పోటీ చేశామని.. కానీ వైసీపీ 151 సీట్లు గెలిచినా పోటీకి భయపడిందని జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. ఇర 2018లో తెలంగాణలో పోటీ చేసిన వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌.. పవన్ కల్యాణ్‌ పార్టీని తనతో పోలుస్తూ విమర్శలు చేయడంపై బర్రెలక్క స్పందించారు. తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని.. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. ఎవరి బలం ఎవరిదని.. పవన్ కల్యాణ్‌ను తక్కువ చేస్తూ మాట్లాడటం తనను బాధించిందని తెలిపారు. దీంతో జనసైనికులు ఆమె మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ బర్రెలక్కకున్న సంస్కారం కూడా ముఖ్యమంత్రి జగన్‌కు లేదని విమర్శలు చేస్తున్నారు.

More News

CM Jagan:పేదవాడికి ఖరీదైన వైద్యం అందించడమే ఆరోగ్యశ్రీ లక్ష్యం: సీఎం జగన్

'వైఎస్సార్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

Bigg Boss Telugu 7 : హౌస్‌ను కనుసైగతో శాసించి.. చాణక్యుడిగా నిలిచి , బిగ్‌బాస్ చరిత్రలోనే శివాజీ రెమ్యూనరేషన్ ఓ రికార్డు

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 7: అమర్‌దీప్‌కు ట్రోఫీ ఎందుకు దూరమైంది.. రన్నరప్‌గా నిలిచినా వచ్చింది సున్నా

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్, అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్‌లు ఫైనలిస్టులుగా నిలవగా..

Chandrababu:చంద్రబాబును చెప్పుతో కొడతా.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిపెట్టాయి. టికెట్ రాదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థుల అనుచరులు

Amardeep: అన్నపూర్ణ వద్ద ఘర్షణ .. అమర్‌పై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి, ఆ లేడి కంటెస్టెంట్ కారు అద్దాలు ధ్వంసం

15 వారాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ 7 తెలుగు ముగిసింది. అందరిని షాక్‌కు గురిచేస్తూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి, బిగ్‌బాస్ చరిత్రలో