Barrelakka: పవన్ కల్యాణ్ గురించి అలా మాట్లాడటం బాధేసింది: బర్రెలక్క
Send us your feedback to audioarticles@vaarta.com
బర్రెలక్క.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. సోషల్ మీడియాలో బర్రెల్కకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో గెలవకపోయినా ఆమె పోరాటస్ఫూర్తికి సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఇండిపెడెంట్‌గా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 5,754 ఓట్లు పొందడం సాధారణమైన విషయం కాదని కొనియాడుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ తెలంగాణలో పోటీ చేసిన జనసేన పార్టీకి అక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్దమనిషికి రాలేదని సెటైర్లు వేశారు. దీంతో వైసీపీ-జనసేన శ్రేణుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్క సీటు లేకపోయినా తాము హుందాగా తెలంగాణలో పోటీ చేశామని.. కానీ వైసీపీ 151 సీట్లు గెలిచినా పోటీకి భయపడిందని జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. ఇర 2018లో తెలంగాణలో పోటీ చేసిన వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్.. పవన్ కల్యాణ్ పార్టీని తనతో పోలుస్తూ విమర్శలు చేయడంపై బర్రెలక్క స్పందించారు. తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని.. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. ఎవరి బలం ఎవరిదని.. పవన్ కల్యాణ్‌ను తక్కువ చేస్తూ మాట్లాడటం తనను బాధించిందని తెలిపారు. దీంతో జనసైనికులు ఆమె మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ బర్రెలక్కకున్న సంస్కారం కూడా ముఖ్యమంత్రి జగన్‌కు లేదని విమర్శలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments