శ్రియకే చెల్లింది
Send us your feedback to audioarticles@vaarta.com
పదహారేళ్లుగా కథానాయికగా రాణిస్తోంది అందాల నటి శ్రియా శరన్. ఇప్పటికీ పెద్ద హీరోల సినిమాల్లో కథానాయికగా దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో గౌతమీ పుత్ర శాతకర్ణి లో అభినయానికి ప్రాధాన్యమున్న వశిష్టీదేవి పాత్రలో మార్కులు కొట్టేసిన శ్రియ.. తాజాగా పైసా వసూల్‌లోనూ ముగ్గురు హీరోయిన్స్‌లో ఒకరిగా నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లోనూ బాలకృష్ణనే హీరో కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో శ్రియ హీరోయిన్‌గా నటించిన ఈ రెండు బాలకృష్ణ చిత్రాలకు ప్రత్యేకతలున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో బాలయ్య వంద చిత్రాల మైలురాయికి చేరుకుంటే.. 101 వ చిత్రమైన పైసా వసూల్ కోసం తన కెరీర్‌లోనే మొదటిసారిగా పాట పాడాడు ఈ నందమూరి అందగాడు. బాలయ్య వందో చిత్రం హీరోయిన్ అనిపించుకున్నా.. బాలయ్య పాడిన తొలి పాటలో అతని పక్కన స్టెప్స్ వేసిన నాయిక అనిపించుకున్నా.. అది శ్రియకే చెల్లింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com