మూడేళ్లుగా దాచిన రహస్యాన్ని బయటపెట్టిన ఇస్రో శాస్త్రవేత్త..
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. మూడేళ్లుగా దాచి ఉంచిన రహస్యాన్ని తాజాగా ఆయన బట్టబయలు చేశారు. ‘ఎంతో కాలంగా దాచి ఉంచిన రహస్యం’ పేరిట తపన్ మిశ్రా పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. ఇస్రోలో సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్న తపన్ మిశ్రా.. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ సమయంలో తనపై విష ప్రయోగం జరిగిందని చెప్పి ఒక్కసారిగా సంచలనం రేపారు.
2017 జులైలో ఈ ఘటన జరిగిందని తపన్ మిశ్రా వెల్లడించారు. ఆ రోజున తాను దోశ తిన్నానని.. దాంతో పాటు ఇచ్చిన చట్నీలో రసాయనిక ప్రయోగం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అది తిన్న అనంతరం తాను అనారోగ్యం పాలయ్యాయని, ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డానని తపన్ తెలిపారు. చర్మంపై ర్యాషెస్ రావడంతో పాటూ అరచేతిపై చర్మం అంతా ఊడిపోయిందన్నారు. తనపై జరిగిన విష ప్రయోగానికి సంబంధించిన రిపోర్టును కూడా తపన్ మిశ్రా ఫేస్‌బుక్ పోస్టులో జత చేశారు.
తపన్ మిశ్రాపై ఆర్సెనిక్ అనే రసాయన ప్రయోగం జరిగినట్టు ఎయిమ్స్ రిపోర్టులో తేలింది. ఈ రిపోర్టును తన పోస్టుకు జత చేసిన తపన్ మిశ్రా.. గూఢచర్య ఆపరేషన్‌లో భాగంగానే ఇది జరిగిందని వెల్లడించారు. మిలిటరీ, వ్యాపార రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ శాస్త్రవేత్తను తొలగించడమే ఈ దాడి వెనుక కారణం అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని కూడా తపన్ మిశ్రా కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com