కరోనాపై పరిశోధనలు.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ వైపు కరోనా నివారణకు పరిశోధనలు జరుగుతుంటే.. మరోవైపు కరోనా బారి నుంచి కాపాడటమెలా? అనే పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి పరిశోధనలు జరిపిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకిన మాన ఊపిరితిత్తుల కణాలపై ల్యాబ్‌లో ప్రయోగాలు చేయగా.. కరోనాను సాధారణ జలుబు స్థాయికి తగ్గించే వీలుందని కనుగొన్నారు. కరోనా వైరస్.. మానవ ఊపిరితిత్తుల్లోని లిపిడ్‌కు సంబంధించిన జీవక్రియలను అడ్డుకుంటోందని.. దీనిని అడ్డుకోగలిగితే కోవిడ్ లక్షణాలు పెరగకుండా సాధారణ జలుబు స్థితిలోనే నిలిపివేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
ముఖ్యంగా కొవ్వును కరిగించే శరీర సామర్థ్యాన్ని కరోనా వైరస్ అడ్డుకుంటోందని.. దానికి కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు వాడే ఫెనోఫైబ్రేట్ ఔషధం వాడితే సరిపోతుందన్నారు. ఈ ఔషధం కొవ్వును కరిగించే వీలును తిరిగి కల్పిస్తుందని చెప్పారు. ఈ ఔషధం కారణంగా వైరస్ పూర్తిగా శక్తిని కోల్పోతుందని వెల్లడించారు. దీంతో ఇది ఒక సాధారణ జలుబుగానే ఉండిపోతుందని ఇజ్రాయెల్ నిర్వహించిన పరిశోధనలో పాల్గొన్న యాకోవ్ నహ్మియాన్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments