కరోనాపై పరిశోధనలు.. ఇంట్రెస్టింగ్‌ న్యూస్ చెప్పిన ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు

  • IndiaGlitz, [Monday,July 20 2020]

ఓ వైపు కరోనా నివారణకు పరిశోధనలు జరుగుతుంటే.. మరోవైపు కరోనా బారి నుంచి కాపాడటమెలా? అనే పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి పరిశోధనలు జరిపిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకిన మాన ఊపిరితిత్తుల కణాలపై ల్యాబ్‌లో ప్రయోగాలు చేయగా.. కరోనాను సాధారణ జలుబు స్థాయికి తగ్గించే వీలుందని కనుగొన్నారు. కరోనా వైరస్.. మానవ ఊపిరితిత్తుల్లోని లిపిడ్‌కు సంబంధించిన జీవక్రియలను అడ్డుకుంటోందని.. దీనిని అడ్డుకోగలిగితే కోవిడ్ లక్షణాలు పెరగకుండా సాధారణ జలుబు స్థితిలోనే నిలిపివేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

ముఖ్యంగా కొవ్వును కరిగించే శరీర సామర్థ్యాన్ని కరోనా వైరస్ అడ్డుకుంటోందని.. దానికి కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు వాడే ఫెనోఫైబ్రేట్ ఔషధం వాడితే సరిపోతుందన్నారు. ఈ ఔషధం కొవ్వును కరిగించే వీలును తిరిగి కల్పిస్తుందని చెప్పారు. ఈ ఔషధం కారణంగా వైరస్ పూర్తిగా శక్తిని కోల్పోతుందని వెల్లడించారు. దీంతో ఇది ఒక సాధారణ జలుబుగానే ఉండిపోతుందని ఇజ్రాయెల్ నిర్వహించిన పరిశోధనలో పాల్గొన్న యాకోవ్ నహ్మియాన్ తెలిపారు.

More News

ఏపీలో కరోనా బీభత్సం.. నేడు 5వేలు దాటిన కేసులు..

ఏపీలో కరోనా బీభత్సం సృష్టించింది. గడిచిన 24 గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

‘ప్రభాస్ 21’పై మండిపడిన దీపిక పదుకొణె..

వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మాణంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 21వ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

చిలుకూరు ఆలయంలో అద్భుతం.. శుభసంకేతమంటున్న రంగరాజన్

చిలుకూరు బాలాజీ అంటే భక్తులకు అపారమైన నమ్మకం. అక్కడ ఏదైనా అనుకుని 11 ప్రదక్షిణలు చేస్తే అది తప్పక జరిగి తీరుతుందనేది భక్తుల విశ్వాసం.

జూలై 31న ‘జీ 5’లో మరో కొత్త సిరీస్‌... మేక సూరి

‘జీ 5’ ఓటీటీలో వచ్చిన ఒరిజినల్‌ తెలుగు సిరీస్‌ ‘గాడ్‌’ (గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి) వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కింగ్‌(ప్రభాస్‌)కి క్వీన్ సెట్.. పిచ్చెక్కించేద్దాం: నాగ్ అశ్విన్

‘మహానటి’తో దర్శకుడిగా తన సత్తాను నిరూపించుకున్న నాగ్ అశ్విన్ తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ 21వ చిత్రాన్ని  తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.