పాట చిత్రీకరణలో 'ఇస్మార్ట్ శంకర్'
- IndiaGlitz, [Wednesday,April 03 2019]
రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవలే గోవాలో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేంది యూనిట్. ఈరోజు(బుధవారం) నుండి హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో గ్రాండ్ స్కేల్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. 'దిమాక్ ఖరాబ్..' అంటూ తెలంగాణ యాసలో సాగే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యానర్స్‌గా పేరున్న హీరో రామ్ మరోసారి అదిరిపోయే స్టెప్పులతో మెప్పించనున్నాడు. కాసర్లశ్యామ్ రాసిన ఈ పాటను కీర్తన శర్మ, సాకేత్ పాడారు. మణిశర్మ సంగీత సారథ్యం అందిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మాతలు మారి రూపొందిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.