ఇస్మార్ట్ శంకర్‌కు ఏడాది పూర్తి!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమాకు ముందు వీరిద్దరికీ తప్పకుండా హిట్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే రామ్‌లో మంచి ఎనర్జీ ఉంది. కానీ పూరికి సక్సెస్ లేదు కదా అని రామ్ అనుకోలేదు. ఆయనపై నమ్మకంతో ఆయనతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇక పూరి హీరోలను మాస్ కోణంలో ఎలా ఆవిష్కరించాలో తెలిసిన దర్శకుడు. వీరిద్దరికీ మణిశర్మ తోడయ్యాడు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. మ్యూజిక్ డైరెక్టర్‌గా మణిశర్మ అప్పటికే డౌన్ఫాలోలో ఉన్నాడు. అయితే వీరి ముగ్గురి కలయిక మాత్రం బాక్సాఫీస్ దగ్గర మాయ చేసింది. వీరి మాయకు నిధి అగర్వాల్, నభా నటేశ్ గ్లామ్ తోడైంది.
ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు పూరి ఏ నమ్మకంతో నిర్మించాడో తెలియదు కానీ.. బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్స్ దుమ్ము లేపింది. రామ్ కెరీర్లో రూ.40 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్‌ను సాధించింది. సినిమాకు ముందు వెల్కమ్ డ్రింక్‌లా మణిశర్మ సాంగ్స్ హోరెత్తాయి. పాటలు సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేశాయి.
సినిమా విడుదలై నేటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా హీరో రామ్ దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్, మరో నిర్మాత ఛార్మి తమ ఆనందాన్ని ప్రేక్షకులతో ట్విట్టర్ మాధ్యమంలో తెలియజేశారు. వీరి కాంబినేషన్లో అప్పట్లో డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఉంటుందని అన్నారు. కానీ తర్వాత ఆ ఊసే లేదు. ఛార్మి మాత్రం పూరి, రామ్ కాంబినేషన్లో సినిమా ఉంటుంది కానీ అడి డబుల్ ఇస్మార్ట్ శంకర్ అని మాత్రం చెప్పలేను అని తేల్చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout