ద‌స‌రా రేసు నుంచి త‌ప్పుకున్న ఇజం..!

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఆత‌ర్వాత ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయాల‌నుకున్నారు.

అయితే...ఎక్కువ సిజీ వ‌ర్క్ ఉండ‌డం, దీనికి తోడు ద‌స‌రా కానుక‌గా వ‌స్తున్న నాలుగైదు సినిమాల గుంపులో కాకుండా సోలోగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచ‌న‌తో ఇజం చిత్రాన్ని అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌డం లేద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ వ‌ర్క్ జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఇజం చిత్రాన్ని అక్టోబ‌ర్ ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది..!