ఇజం ఇన్నోవేటివ్ ప్రమోషన్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ హీరో కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ యక్షన్ ఫిల్మ్ ఇజం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ రామ్ సరసన ఆదితి ఆర్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటించిన ఇజం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఇజం చిత్రం వలే...ప్రమోషన్స్ విషయంలో కూడా సరికొత్త దారిలో వెళుతూ అందర్ని ఆకట్టుకుంటుంది.
ఎంత పెద్ద సినిమా అయినా సరే...రెండు మూడు వారాలే..! అందుకనే ఈ రెండు మూడు వారాల్లోనే రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించేలా ఎవరికివారు డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఇజం టీమ్ ఛానల్, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా ప్రమోషన్స్ తో పాటు ఇన్నోవేటివ్ గా వాకర్స్ విత్ బ్యాక్ లిట్ బోర్డ్స్ తో సరికొత్తగా ప్రచారం చేస్తున్నారు. మెయిన్ సిటీల్లో రద్దీగా ఉండే ప్లేస్ స్ లో ఈ వాకర్స్ విత్ బ్యాక్ లిట్ బోర్డ్స్ తో ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ రిపోర్ట్ బాగుంది. ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ టాక్ ఉంది. దీనికి తోడు ఇన్నోవేటివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే...ఇజం విజయం ఖాయం అనిపిస్తోంది. మరి....అంచనాలకు తగ్గట్టే ఇజం ఘన విజయం సాధిస్తుందని ఆశిద్దాం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com