శ్రీలంకలో మారణహోమం వెనుక ఐసిస్ హస్తం!
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీంలక రాజధాని కొలంబోలో జరిగిన ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది!. ఐసిస్ ఆత్మాహూతి దళ సభ్యులు ఈ ఘటనకు కారణమని శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జహ్రెయిన్ హుస్సేన్, అబు మొహమ్మద్ అనే ఉగ్రవాదులు రెండు ప్రాంతాల్లో ఆత్మాహూతి దాడులకు పాల్పడినట్లు అధికారులు ధ్రువీకరించారు. జిహాద్ పేరుతో దాడులు చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. జహ్రెయిన్ హుస్సేన్ పర్యాటకునిగా షాంగ్రిలా హోటల్‌కు వెళ్లినట్లు అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
షాంగ్రిలా హోటల్లో ప్రవేశించిన అనంతరం తనను తాను పేల్చేసుకుని ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. మరో ఉగ్రవాది అబు మొహమ్మద్ బట్టికలోవాలోని చర్చిపై దాడికి పాల్పడ్డాడని అధికారులు గుర్తించినట్లు సమాచారం. పర్యాటకుడి రూపంలో చర్చి వద్దకు వెళ్లి ఉంటాడని శ్రీలంక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమానిస్తున్నది.
హెచ్చరించినా పట్టించుకోని సర్కార్!?
కాగా.. ఈస్టర్ పండుగ రోజున దాడులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని 10 రోజుల ముందే శ్రీలంక ఇంటెలిజెన్స్ హెచ్చరించినా..
సర్కార్ పట్టించుకోని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఈ దాడికి ప్రభుత్వ నిర్లక్ష్యమే దాడులకు కారణమంటూ పలువురు ప్రముఖులు, బాధిత కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీలంకలో హై అలెర్ట్..
ఇదిలా ఉంటే.. శ్రీలంకలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీలంక కేబినెట్ అత్యవసర సమావేశమైంది. కాగా.. నేటి సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని సర్కార్ తెలిపింది. విద్యాసంస్థలకు సైతం రెండు రోజుల పాటు శ్రీలంక ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాగా ఇప్పటి వరకూ మొత్తం ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 185 మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com
Comments