'ఇష్క్' ఫస్ట్ జోల్ట్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సౌత్ ఇండియాలోని ప్రతిష్ఠాత్మక బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామంతో మళ్లీ తెలుగులో వరుసగా చిత్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల 'జాంబీ రెడ్డి' మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో 2021లో తన తొలి చిత్రం 'ఇష్క్'ను నిర్మిస్తోంది. నాట్ ఎ లవ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్.
ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ కలిసి నిర్మిస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఆర్.బి. చౌదరి సమర్పిస్తున్నారు.
శుక్రవారం ఈ ఫిల్మ్ ఫస్ట్ జోల్ట్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో తేజ కోపంగా చూస్తుంటే, ప్రియా ప్రకాష్ నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇంప్రెసివ్‌గా ఉన్న ఈ ఫస్ట్ జోల్ట్లోని హీరో హీరోయిన్ల ఎక్స్ప్రెషన్స్ ట్యాగ్‌లైన్‌ను జస్టిఫై చేస్తున్నాయి.
మహతి స్వరసాగర్ బాణీలు సమకూర్చగా, ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రాశారు.
శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా, ఎ. వరప్రసాద్ ఎడిటర్‌గా, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.
త్వరలోనే ఇష్క్ థియేటర్లలో విడుదల కానున్నది.
తారాగణం: తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com