కరోనా బారిన పడిన మరో హీరోయిన్.. పంజాబీ బ్యూటీ ఇషా చావ్లాకు పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా కోవిడ్ బారినపడటం కలకలం రేపుతోంది. కరోనా మొదటి, రెండో దశ వేవ్‌లకు మించి నటీనటులు వైరస్ బారినపడుతున్నారు. అంతేకాదు వీరిలో పలువురి పరిస్దితి విషమంగా వుంది. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, త్రిష, వడివేలు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, అరుణ్ విజయ్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, తమన్, రాజేంద్ర ప్రసాద్, కరీనా కపూర్, అమృతా అరోరా, సత్యరాజ్‌లకు పాజిటివ్‌గా తేలింది. తాజాగా సీనియర్ హీరోయిన్ ఇషా చావ్లా వైరస్ బారినపడ్డారు.
సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకినట్టు ఆమె స్వయంగా వెల్లడించింది. నాకు కోవిడ్ సోకింది.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్స్ చెప్పిన విధంగా నిబంధనలు పాటిస్తూ.. మెడిసిన్స్ వాడుతున్నాని ఇషా చావ్లా తెలిపారు. అందరూ సామాజిక దూరం పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు పాటించి సేఫ్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అంటూ ఇషా పోస్ట్ చేశారు. త్వరలోనే కరోనా నుండి బయటపడి షూటింగ్‌లలో పాల్గొంటానని ఆమె తెలియజేశారు. దీంతో ఇషా చావ్లా త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.
సాయికుమార్ తనయుడు ఆది నటించిన ‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఇషా చావ్లాకు ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ లభించలేదు. అనంతరం అప్పుడపుడు కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం కబీర్ లాల్ దర్శకత్వంలో 6 భాషల్లో వస్తున్న “దివ్య దృష్టి” సినిమాలో ఇషా చావ్లా మెయిన్ లీడ్ చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com