విశాల్ పెళ్లి ఆగిపోయిందా?
- IndiaGlitz, [Thursday,August 22 2019]
తెలుగువాడైన కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి ఆగిపోనుందా? అంటే అవునని గుసగుసలు వినిపించాయి. తమిళంతో పాటు తెలుగులోనూ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విశాల్ కోలీవుడ్ నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాత మండిలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది మార్చి 10న విశాల్, హైదరాబాద్‌కు చెందిన అనీషా రెడ్డితో నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్‌లో వీరి పెళ్లి జరుగుతుందనే వార్తలు కూడా వచ్చాయి. త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని వార్తలు వినిపించాయి. ఈ తరుణంలో అనీషా నిశ్చితార్థం ఫోటలను సోషల్ మీడియా మాధ్యమం నుండి తొలగించడం పలు సందేహలకు తావిస్తుంది. విశాల్, అనీషా మధ్య మనస్పర్ధలు రావడం వల్లే బ్రేకప్ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.
నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ కలిసి టర్కీలో చక్కర్లు కొట్టారు. అయితే వీరి నిశ్చితార్థం ఆగిపోయిందనే వార్తలపై అటు విశాల్, ఇటు అనీషాకు సంబంధించిన వ్యక్తులు స్పందించడం లేదు. అనీషా అర్జున్ రెడ్డి, పెళ్ళిచూపులు చిత్రాల్లో నటించింది. తమిళంలో 'అయోగ్య' చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసిందని, దేవుడు తన కోసమే అనీషాను పంపాడని విశాల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఇప్పుడు విశాల్, అనీషాలకు సంబంధించిన రూమర్స్‌కు చెక్ పడాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరో పక్క విశాల్ నడిగర్ సంఘం భవనాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే.. మరో పక్క నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు కూడా రావాల్సి ఉంది. ఈసారి విశాల్ పాండవర్ కూటమికి భాగ్యరాజా టీమ్ నుండి గట్టిపోటీయే ఎదురు కానుంది. ఈ ఫలితాలు, మరో పక్క తాను చేయాల్సిన సినిమాలు కూడా విశాల్‌కు పెద్ద టెన్షన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ సమస్యలను విశాల్ ఎలా పరిష్కరించుకుంటాడో వేచి చూడాల్సిందే..