విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? తప్పించారా?
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి గత ఏడాది బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. కానీ విజయ్ సేతుపతి ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం.. దక్షిణాదిలో అవకాశాలన్నీ వినియోగించుకుంటూ దూసుకెళుతున్న విజయ్ సేతుపతికి బాలీవుడ్‌లో నటించే అద్భుతమైన అవకాశం వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతిని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా గత ఏడాది మార్చిలోనే షూటింగ్ జరగాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా పరిస్థితులతో పాటు అన్నీ మారిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ వినిపిస్తోంది. ‘లాల్‌సింగ్ చద్దా’ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్టు సమాచారం. అయితే తప్పుకున్నాడా? తప్పించారా? అనేది మాత్రం తెలియడం లేదు. బయటకు వచ్చిన విషయం ఏంటంటే లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ప్రాజెక్టులన్నీ ఒక్కసారిగా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో విజయ్ సేతుపతి ‘లాల్‌సింగ్ చద్దా’ ప్రాజెక్టును వదులుకున్నట్టు కోలీవుడ్ టాక్.
దీనిపై మరో టాక్ కూడ బలంగానే వినిపిస్తోంది. కొన్ని సినిమాల కోసం విజయ్ సేతుపతికి బరువు పెరగాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో విజయ్ బాగా బరువు పెరిగాడు. ఇది ‘లాల్‌సింగ్ చద్దా’ యూనిట్‌కి మింగుడు పడలేదట. ఆయనను తమ సినిమాలోకి తీసుకునేందుకు చిత్ర యూనిట్ సానుకూలంగా లేదట. విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి స్వయంగా తప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అసలు ఇదంతా నిజమేనా? ‘లాల్‌సింగ్ చద్దా’ నుంచి విజయ్ తప్పుకున్నాడా? లేదా? అనేది అధికారిక ప్రకటన వస్తేనే తెలియనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com